తననుతాను గొప్ప మధ్యవర్తిగా, ప్రపంచ శాంతి దూతగా ఆవిష్కరించుకునేందుకు ఉబలాటపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపినట్లయితే ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదిస్తానని హిల్లరీ చెప్పారు. అయితే ఒక షరతు ఉందంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఉక్రెయిన్ తన భూభాగాన్ని రష్యాకు వదులుకోవాల్సిన అవసరం లేకుండాని రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ముగించాలని పేర్కొన్నారు. అలా చేసినట్లయితే అమెరికా అధ్యక్షుడిని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తాని వెల్లడించారు.

నిజాయితీగా చెప్పాలంటే, ఉక్రెయిన్ తన భూమిని దురాక్రమణదారు దేశానికి (రష్యాకు) వదిలివేయాల్సిన అవసరం లేని విధంగా, ఇప్పటివరకు మనం చూడని విధంగా పుతిన్‌కు వ్యతిరేకంగా దృఢంగా నిలబడగలిగే విధంగా మూడేండ్లుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేలా చూడాలని హిల్లరీ పేర్కొన్నారు. ట్రంప్ దాని రూపశిల్పి అయితే, ఆయనను నోబెల్ బహుమతికి ప్రతిపాదిస్తానన్నారు.
















