Namaste NRI

హాకీ గోల్ కీప‌ర్‌కు అమెరికా అత్యున్న‌త పుర‌స్కారం

హాకీ గోల్ కీప‌ర్‌కు అమెరికా అత్యున్న‌త పుర‌స్కారం ల‌భించింది. మిలాన్ కోర్టినా ఒలింపిక్స్ పురుషుల హాకీ ఈవెంట్‌లో అమెరికాకు స్వ‌ర్ణ ప‌త‌కం అందించిన గోల్‌కీప‌ర్ కొన్నార్ హెల్లిబ‌క్‌కు ప్రెసిడెన్షియ‌ల్ మెడ‌ల్ ఆఫ్ ఫ్రీడం అవార్డును ఇవ్వ‌నున్న‌ట్లు ట్రంప్‌ ప్ర‌క‌టించారు. ఆయ‌న ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఆ ఒలింపిక్స్‌లో కెన‌డాతో జ‌రిగిన గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్‌లో హెల్లిబ‌క్ కీల‌క పాత్ర‌ను షోపించాడు. గోల్‌కీప‌ర్‌గా అత‌ను 41 గోల్స్‌ను సేవ్ చేశాడు. దీంతో మ్యాచ్ 1-1తో టై అయ్యింది. అయితే ఆ త‌ర్వాత జాక్ హ్యూగ్స్ ఓ గోల్ స్కోరు చేయ‌డంతో అమెరికా స్వ‌ర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్న‌ది. సెకండ్ హాఫ్‌లో త‌న స్టిక్‌తో హెల్లిబ‌క్ గోల్‌ను ఆప‌డం మ్యాచ్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌గా మారింది. ఒక‌వేళ ఆ గోల్‌ను సేవ్ చేయ‌కుంటే, అప్పుడు ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. ఐస్ హాకీలో చాన్నాళ్ల త‌ర్వాత అమెరికా జ‌ట్టు గోల్డ్ మెడ‌ల్‌ను సాధించింది. దీంతో ప్ర‌స్తుతం అమెరికా జ‌ట్టుపై ప్ర‌శంస‌లు కురుస్తూనే ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events