Skip to main content

Namaste NRI

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో అర్సెలార్ మిట్టల్- నిప్పాన్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన

అర్సెలార్ మిట్టల్- నిప్పాన్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్- నిప్పాన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును సాకారం చేసి చూపించాం. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాజెక్టు సాకారం కావటంలో కృషి చేసిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్‌ను అభినందిస్తున్నా. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని అన్నారు.

నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ , కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మ, శాసనసభ స్పీకర్ సి హెచ్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేష్, శ్రీమతి వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్,టీ జీ భరత్, కె అచ్చెన్నాయుడు, శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎమ్మెల్యేలు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిలకించారు. AM/NS ఇండియా ప్లాంట్ కు సంబంధించిన వివరాలు, ఉక్కు రంగంలో AM/NS ఇండియా సంస్థ సాధించిన ప్రగతి వంటి అంశాలపై వీడియో ప్రజెంటేషన్‌ను కూడా చూశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events