
రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘనా రాయ్ ప్రధాన పాత్రల్లో మహి కోమటిరెడ్డి తెరకెక్కించిన చిత్రం మిస్టీరియస్. జై వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని అడుగు అడుగునా అంటూ సాగే గీతాన్ని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వారి నిబద్ధతను అద్భుతంగా రాసి, ఆ పాటకు స్వరాలందించినందుకు సంగీత దర్శకుడు ఎంఎల్ రాజాని అభినందించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఓ కొత్త ఒరవడిలో రూపొందించిన దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.
















