Skip to main content

Namaste NRI

హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ గారి చేతుల మీదుగా మిస్స్టీరియస్ నుంచి అడుగు అడుగునా  సాంగ్ రిలీజ్

రోహిత్‌ సాహ్ని, రియా కపూర్‌, మేఘనా రాయ్‌ ప్రధాన పాత్రల్లో మహి కోమటిరెడ్డి తెరకెక్కించిన చిత్రం మిస్టీరియస్‌. జై వల్లందాస్‌ నిర్మించారు. ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే  ఈ చిత్రంలోని అడుగు అడుగునా అంటూ సాగే గీతాన్ని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వారి నిబద్ధతను అద్భుతంగా రాసి,  ఆ పాటకు స్వరాలందించినందుకు సంగీత దర్శకుడు ఎంఎల్‌ రాజాని అభినందించారు. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ఓ కొత్త ఒరవడిలో రూపొందించిన దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.

Social Share Spread Message

Latest News