Namaste NRI

హైదరాబాద్ టు లండన్.. ఎయిర్ ఇండియా సర్వీసులు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. హైదరాబాద్‌ నుంచి లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు లండన్‌ నుంచి మొదటి విమానం సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌ చేరుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్‌ 10వ తేదీన హైదరాబాద్‌ నుంచి లండన్‌ నాన్‌స్టాప్‌ విమానం టేకాఫ్‌ కానుందని వెల్లడిరచింది. బోయింగ్‌ 787 ఎయిర్‌ క్రాఫ్ట్‌ ద్వారా 256 సీట్లతో వారానికి రెండుసార్లు ఈ ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ఎయిరిండియా తెలిపింది. ఇందులో 18 బిజినెస్‌ క్లాసులు, 238 ఎకానమీ క్లాసులు ఉంటాయంది.

                 ప్రతి సోమ, శుక్రవారాల్లో హైదరాబాద్‌ నుంచి లండన్‌కు నాన్‌స్టాఫ్‌ విమాన సర్వీసులు నడవనున్నాయి. భారత్‌`యూకే సెక్టార్‌ మధ్య విమానయాన సంబంధాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని ఎయిరిండియా తెలిపింది. ఇప్పటి వరకు ఢల్లీి, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్‌, గోవా, అమృత్‌సర్‌ నగరాల నుంచే లండన్‌కు నేరుగా విమాన సర్వీసులు ఉండగా ఇకపై హైదరాబాద్‌ కూడా ఈ జాబితాలో చేరనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress