ఉక్రెయిన్ తమ షరతులకు త్వరగా ఒప్పుకోకుంటే మరింత విధ్వంసం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. పుతిన్ దేశ పార్లమెంట్‌నుద్దేశించి మాట్లాడారు. క్రిమియా, వేర్పాటువాదుల ప్రాబల్య ప్రాంతాలతో పాటు అక్రమిత ప్రాంతాలపై తమ సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని ఉక్రెయిన్‌ను డిమాండ్ చేశారు. తామింకా పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభించనే లేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ఐదు నెలలుగా కొనసాగుతున్న వేళ ఆయన ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.




























