Skip to main content

Namaste NRI

బ్రిటన్ హోమంత్రికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్

వీసా పరిమితి దాటిన తర్వాత బ్రిటన్లో నివసించే వారిలో అత్యధికులు భారతీయులే అని ఆ దేశ హోంమంత్రి, భారతీయ మూలాలున్న సుయెల్లా బ్రేవర్మన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గత ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్ (ఎంఎంపీ) ఆశించిన రీతిలో పనిచేయడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ గట్టిగా బదులిచ్చింది. ఎంఎంపీ ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని లండన్లోని ఇండియన్ హైకమిషన్ బదులిచ్చింది. అలాగే ఈ ఒప్పంద ప్రణాళికల్లో భాగంగా బ్రిటన్ వైపు నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.
ఇరు దేశాల మధ్య చర్చల్లో ఉన్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ), వీసాల విధానంపైనా సుయెల్లా వివాదాస్పదంగా స్పందించారు. భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఆందోళనలు ఉన్నాయన్నారు. దీనికి భారత హైకమిషన్ స్పందిస్తూ మొబిలిటీ, మైగ్రేషన్కు సంబంధించిన విషయాలపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో వాటి గురించి వ్యాఖ్యలు సమంజసంగా ఉండకపోవచ్చు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందమైనా ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది అని వెల్లడిరచింది. మరోవైపు యూకే మంత్రి వ్యాఖ్యలతో ఎఫ్టీఏలో భారతీయులకు వీసా రాయితీలకు మంత్రివర్గం మద్దతును నిలిపివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events