Namaste NRI

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఇండియన్-అమెరికన్, పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు. ఈ సందర్భంగా  రామస్వామి మాట్లాడుతూ చైనాపై ఆధారపడటానికి ముగింపు పలుకుతానని, అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. అమెరికా ఫస్ట్ అన్నదే తన నినాదమని పేర్కొన్నారు. రామస్వామి  ఇప్పటికే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ స్పీచ్‌లు  ఇవ్వడం, టెస్ట్ రన్స్  చేస్తున్నారు. మిస్టర్ రామస్వామి  తల్లిదండ్రులు కేరళ నుండి యునైటెడ్ స్టేట్స్‌కు  వలసవెళ్లారు.  అతని తండ్రి ఒహియోలోని జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో  పని చేస్తున్నారు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు.  రామస్వామి ఒక ప్రముఖ బయోటెక్ వ్యవస్థాపకుడు కూడా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events