Skip to main content

Namaste NRI

స్పెల్లింగ్​ బీ విజేతగా భారత సంతతి బాలుడు

అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ విజేతగా హైదరాబాద్‌ మూలాలున్న ఇండియన్‌ అమెరికన్‌ విద్యార్థి ఫైజన్‌ జకీ (13) నిలిచాడు. 2025 స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీలో eclaricissement అనే పదాన్ని ఉచ్ఛారణ దోషం లేకుండా సరిగ్గా పలికినందుకు జకీ ఈ పరీక్షలో విజేతగా నిలిచాడు. జకీ తాత హైదరాబాద్‌ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో ఈ పరీక్షను వీక్షించారు.

ప్రతిష్టాత్మక ఈ పోటీ పరీక్షలో భారతీయ-అమెరికన్‌ విద్యార్థుల సత్తా ఈ ఏడాది కూడా కొనసాగడం విశేషం. తనతో పోటీపడిన సర్వదన్య కదంపై టెక్సాస్‌లోని సీఎం రైస్‌ మిడిల్‌ స్కూలులో 7వ తరగతి చదువుతున్న జకీ విజయం సాధించాడు. 2024లో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ పరీక్షలో జకీ పాల్గొనడం ఇది నాలుగోసారి. ఈ ఏడాది విజేతగా నిలిచిన జకీకి స్క్రిప్స్‌ నుంచి 50,000 డాలర్ల (రూ. 42.77 లక్షలు) నగదు బహుమతి, ఓ మెడల్‌, ట్రోఫీ లభిస్తాయి.

Social Share Spread Message

Latest News