Skip to main content

Namaste NRI

ఫ్రాన్స్‌తో భారత్‌ ఒప్పందం …63 వేలకోట్లతో

 ఫ్రాన్స్‌ నుంచి 26 అత్యాధునిక రాఫెల్‌ మెరైన్‌ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌, నావికా దళం వైస్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ కే స్వామినాథన్‌ పాల్గొన్నారు. ఈ విమానాల కొనుగోలుకు ఈ నెల 9న భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కాంట్రాక్టులో భాగంగా సింగిల్‌ సీటర్‌ విమానాలు 22, ట్విన్‌ సీటర్‌ విమానాలు నాలుగు మన దేశానికి వస్తాయి.

లాజిస్టికల్‌ సపోర్ట్‌, భారత నావికా దళ సిబ్బందికి శిక్షణ, మన దేశంలోనే విడిభాగాల తయారీ వంటివి కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ విమానాల రాక 2029 చివరి నుంచి ప్రారంభమై, 2031 నాటికి పూర్తవుతుంది. అత్యాధునిక రాఫెల్‌-ఎం యుద్ధ విమానాల రాకతో సముద్రాలపై యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు మన దేశానికి మరింత పెరుగుతాయి. హిందూ మహా సముద్రంలో ముప్పును ఎదుర్కొనే సత్తా కూడా పెరుగుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events