Skip to main content

Namaste NRI

పాత రోజుల్ని గుర్తు చేసింది… మిస్టర్‌ మిడిల్‌క్లాస్

శ్రీకాంత్‌, లయ నాయకానాయికలుగా రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిస్టర్‌ మిడిల్‌క్లాస్‌. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించడంతో పాటు ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్‌, దశరథ్‌, రచయిత కోన వెంకట్‌ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ మధ్యతరగతి కష్టాలను వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించారన్నారు.ఇందులో నటించిన ప్రతీ ఆర్టిస్టుతో గతంలో తాను సినిమాలు చేశానని, మళ్లీ వారందరితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం పాత రోజులను గుర్తుకు తెచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో తాను వెంకటేశ్వరస్వామి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నానని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టబోతున్నారని, రాజేంద్రప్రసాద్‌ పాత్ర వెన్నెముకలా నిలిచిందని, ఆద్యంతం హాస్యభరితంగా సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events