అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన ఫ్యామిలీతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా తొలి రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇక నిన్న జైపూర్ వెళ్లిన ఉపాధ్యక్షుడి ఫ్యామిలీ,ఇవాళ ఆగ్రా సందర్శనకు వెళ్లింది.

జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి యూపీలోని ఆగ్రాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాన్స్ ఫ్యామిలీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య జేడీ వాన్స్ తన ఫ్యామిలీతో తాజ్ మహల్ సందర్శనకు వెళ్లారు. అక్కడ తాజ్ అందాలను వీక్షించి, ఫొటోలకు ఫోజులిచ్చారు.
