Skip to main content

Namaste NRI

తాజ్‌మహల్‌ను సందర్శించిన జేడీ వాన్స్‌

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌  తన ఫ్యామిలీతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భార్య ఉషా వాన్స్‌, ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యారు. ఈ సందర్భంగా తొలి రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇక నిన్న జైపూర్‌ వెళ్లిన ఉపాధ్యక్షుడి ఫ్యామిలీ,ఇవాళ ఆగ్రా సందర్శనకు వెళ్లింది.

జేడీ వాన్స్‌ తన భార్య ఉషా వాన్స్‌, ముగ్గురు పిల్లలతో కలిసి యూపీలోని ఆగ్రాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాన్స్‌ ఫ్యామిలీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య జేడీ వాన్స్‌ తన ఫ్యామిలీతో తాజ్‌ మహల్‌ సందర్శనకు వెళ్లారు. అక్కడ తాజ్‌ అందాలను వీక్షించి,  ఫొటోలకు ఫోజులిచ్చారు.

Social Share Spread Message

Latest News