నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. కాజల్, బాలయ్యకు జోడీగా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాజల్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాలోని కాజల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కాజల్ ఓ చేతిలో బుక్ పట్టుకుని మరో చేతిలో ఫోన్ పట్టుకుని కాల్ మాట్లాడుతుంది. కళ్లజోడు ధరించి క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. శ్రీలీల కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికిసంగీతం: ఎస్ థమన్, డీవోపీ: సి రామ్ ప్రసాద్, ఎడిటర్: తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్, ఫైట్స్: వి వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ, పీఆర్వో: వంశీ-శేఖర్.