Skip to main content

Namaste NRI

భగవంత్ కేసరి నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్‌లుక్‌ విడుదల

నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్  అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది  నిర్మిస్తున్నారు. కాజల్‌, బాలయ్యకు జోడీగా నటిస్తుంది.  ఈ సినిమా   ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.  కాజల్‌ బర్త్‌డే సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమాలోని కాజల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కాజల్‌ ఓ చేతిలో బుక్‌ పట్టుకుని మరో చేతిలో ఫోన్‌ పట్టుకుని కాల్ మాట్లాడుతుంది. కళ్లజోడు ధరించి క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ చేసింది. శ్రీలీల కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికిసంగీతం: ఎస్ థమన్, డీవోపీ: సి రామ్ ప్రసాద్, ఎడిటర్: తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్, ఫైట్స్: వి వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ, పీఆర్వో: వంశీ-శేఖర్.

Social Share Spread Message

Latest News