Namaste NRI

వాయు వేగంతో వస్తున్న కార్తికేయ

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న చిత్రం భజే వాయు వేగం. ప్రశాంత్‌ రెడ్డి దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను అగ్ర హీరో మహేష్‌బాబు సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో హీరో కార్తికేయ క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకొని పరుగులు తీస్తూ కనిపిస్తు న్నారు. వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కార్తికేయ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుం ది. కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి అని చిత్రబృందం పేర్కొంది. ఐశ్వర్యమీనన్‌, రాహుల్‌ టైసన్‌, తనికెళ్ల భరణి, రవిశంకర్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: రథన్‌, దర్శకత్వం: ప్రశాంత్‌ రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events