Skip to main content

Namaste NRI

సౌతాఫ్రికాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు 

సౌతాఫ్రికాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ బ‌ర్త్‌డే  వేడుకలను పురస్కరించుకొని సౌతాఫ్రికా బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ఆధ్వర్యములో జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌, న్యూజెరూసలేం, చిల్డ్రన్ హోమ్‌లో  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల సమక్షంలో కేక్ కట్ చేశారు. కేప్‌టౌన్‌లోని  షిలోహ్ సినర్జీపూర్ కమ్యూనిటీ ఆశ్రమంలో, డ‌ర్బ‌న్‌లో  సెయింట్ థామస్ హోమ్ ఫర్ చిల్డ్ర‌న్‌లో  నిత్యావసర సరుకుల్ని అందజేశారు. జోహన్నెస్‌బ‌ర్గ్‌లో వెంకట్ రావు తాళ్లపల్లి, కేప్‌టౌన్‌లో వీర‌న్న గాండ్ల, డ‌ర్బ‌న్‌లో సంతోష్, షేక్ బాబా ముందుండి నడిపించినందుకు, వారికి గుర్రాల నాగరాజు  ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు.

 ఈ కార్యక్రమాల్లో మేడసాని నరేందర్ రెడ్డి, సాయి చిట్టంపల్లి , వంశీ వేయిశెట్టి, కళ్యాణ్ బత్తిన, తలసాని శ్రీనివాస్ రెడ్డి, కుమార్ భాయ్, హరీష్ రంగ, సాయి కిరణ్ నల్ల, నరేష్ తేజ, కాశీ, అనిత(మధ్య ప్రదేశ్ ), పేర్ల ప్రసాద్,  మర్రు సతీష్, అరవింద్ జయారపు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events