Skip to main content

Namaste NRI

డాలస్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి కెటిఆర్ పుష్పాంజలి

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌   అమెరికాలో డాలస్ నగరంలో నెలకొనియున్న, దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహమే ఆయుధాలుగా దేశ ప్రజలందరినీ సమాయత్తపరచి, బ్రిటిష్ బానిస సంకెళ్లనుండి భారతదేశాన్ని విడిపించి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ కృషి ఎంతైనా కొనియాడతగ్గది అన్నారు. అందుకే ప్రపంచం అంతా గాంధీజీని నేటికీ ప్రశంసిస్తూనే ఉంటారు. అలాంటి విశ్వనాయకుడి యుగపురుషుడి విగ్రహాన్ని యింత పెద్దఎత్తున డాలస్ (ఇర్వింగ్) నగరంలో నెలకొల్పడంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర వారి కార్యవర్గసభ్యుల కృషిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ  అమెరికా దేశంలోనే అతి పెద్దదైన ఈ మహాత్మాగాంధీ స్మారక స్థలిని నిర్మించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ నిర్మాణం ప్రవాస భారతీయుల సమిష్టి కృషికి, ఐకమత్యానికి నిదర్శనమని, దీన్ని సాకారం చెయ్యడంలో అనుమతులిచ్చిన నగర అధికారులకు, సహకరించిన దాతలకు, కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా డాలస్ ప్రాంతసందర్శనకు వచ్చిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, స్థానిక రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు అనునిత్యం ఈ గాంధీజీ స్మారకస్థలిని సందర్శిస్తూనే ఉంటారు అన్నారు.  కెటిఆర్ ను బోర్డ్ సభ్యులు  రావు కల్వాల, బి. ఎన్ రావు, తైయాబ్ కుండావాల, మురళి వెన్నం, రాజేంద్ర వంకావాల, అనంత్ మల్లవరపు, వినోద్ ఉప్పు, షబ్నం మాడ్గిల్ లతో కలసి డా. ప్రసాద్ తోటకూర ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కోపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్ రమేష్ ప్రేమ్ కుమార్, ఎన్నారై భారాస అమెరికా విభాగ అధ్యక్షుడు తన్నీరు మహేష్, ఎన్నారై భారాస గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేష్, ఎల్.రమణ, తాతా మధు, నవీన్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, సుధీర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గాదరి కిషోర్, క్రాంతి కిరణ్, పైలట్ రోహిత్ రెడ్డి, కోరుకంటి చందర్, నోముల భగత్, బాణొత్ చంద్రవతి, గండ్ర జ్యోతి, దామోదర్, జాన్సన్ నాయక్, అమరెందర్ రెడ్డి, రఘువీర్ సింగ్, యుగంధర్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి, అభిలాష్ రంగినేని, సోమ ఉపేందర్ గౌడ్, వంశీ రెడ్డి, అరవింద్ రావు తక్కెళ్లపల్లి, పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events