లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేశ్ నిర్మించనున్న చిత్రం సతీ లీలావతి పూజా కార్యక్రమాలు జరిగాయి. నటుడు వరుణ్తేజ్, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్, నిర్మాతలు హరీశ్ పెద్ది, వి.ఆనంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీశ్ పెద్ది క్లాప్ కొట్టారు. వరుణ్తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్టైనర్గా సతీ లీలావతి రూపొందుతోంది. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం అని అన్నారు.