దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నా రు. 1980-90 దశకం నడుమ జరిగే పీరియాడిక్ డ్రామా ఇది. ముంబయి నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా మెప్పిస్తుంది. ఓ సాధారణ వ్యక్తి యొక్క అసాధారణ ప్రయాణానికి దృశ్యరూపంగా ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది అని చిత్రబృందం పేర్కొంది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.