బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతోన్న డివైన్, యాక్షన్ అడ్వెంచర్ బీఎస్‌ఎస్ 12 (వర్కింగ్ టైటిల్). సుధీర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ చందు నిర్మాత. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెండుకాళ్లు సీటుపై పెట్టి ధైర్యంగా బైక్ నడుపుతూ అడ్వెంచర్ అవతార్‌లో బెల్లంకొండ సాయి కనిపిస్తున్నా రు. అతని వెనుక ఒక కొండ, ఆ కొండపై రగులుతున్న విష్ణు నామాలు చూడొచ్చు. 400ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇదని, బెల్లంకొండ సాయి కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్నదని, 35శాతం షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాణం: మూన్‌షైన్ పిక్చర్స్.