Skip to main content

Namaste NRI

డెట్రాయిట్‌లో ఎన్నారైల సామూహిక నిరాహార దీక్ష

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు పట్ల విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని మిచిగాన్‌ రాష్ట్రం డెట్రాయిట్‌ నగరంలో పలువురు ప్రవాసాంధ్రులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరంలో తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళుర్పించిన అనంతరం నిరాహార దీక్ష కొనసాగించారు. చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో తమ సంఫీుభావాన్ని ప్రకటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News