ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బీఆర్‌ఎస్ ఎన్నారై కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. కువైట్ అధక్షురాలు అభిలాష గొడిశాల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా అభిలాష మాట్లాడుతూ కవిత అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ పండుగను విశ్యవ్యాప్తం చేయడంలో ఆమె ఎంతో శ్రమించారని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్ కోసం పోరాటం చేయడంతో పాటు మరెన్నో విషయాల్లో మా మహిళలందరికి కవిత స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని ఆక్షాంక్షించారు. ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, రవి సుధగాని, ప్రమోద్ కుమార్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.