అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన యోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో అత్యధిక దేశాలకు చెందిన ప్రతినిధులు భాగస్వామ్యం కావడంతో ఈ రికార్డు నమోదైంది. ఐరాస ఉన్నతాధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలతోపాటు 180 దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ యోగా ఏ ఒక్క దేశం, మతం, వర్గానికి చెందినది కాదన్నారు. దీనికి ఎలాంటి కాపీరైట్, పేటెంట్, రాయల్టీలు లేవని స్పష్టం చేశారు.



