Skip to main content

Namaste NRI

ది ప్యారడైజ్ నుంచి మోహన్‌బాబు ఫస్ట్‌లుక్ విడుదల

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ది ప్యారడైజ్‌.   శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ హైదరాబాద్‌ నేపథ్య పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో శికంజ మాలిక్‌ అనే పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలో మోహన్‌బాబు కనిపించనున్నారు. ఆయన పాత్ర తాలూకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. గన్‌, కత్తి పట్టుకొని సిగార్‌ కాలుస్తూ, చుట్టూ ఆయుధాల నడుమ ఆయన పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. గొప్ప హీరోలతో పాటు గొప్ప విలన్లూ ఉంటారు.

ఈ రెండూ ఆయనే. వాటికంటే ఎక్కువే. ఆయన పేరు శికంజ మాలిక్‌. చీకటి సామ్రాజ్యాధినేత వస్తున్నాడు. ది లెజెండరీ మోహన్‌బాబుగారు పతాకస్థాయి విలనిజం చూపించడానికి మీ ముందుకువస్తున్నాడు అంటూ నాని ఈ పోస్టర్‌పై వ్యాఖ్యానించారు. ది ప్యారడైజ్‌ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News