శ్రీకమల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జిలేబి. శివాని రాజశేఖర్ నాయికగా నటిస్తున్నారు. సీనియర్ దర్శకుడు విజయ్‌భాస్కర్ దర్శకత్వలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్కే ఆర్ట్స్ పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. హిలేరియన్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. జూలై 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.


