
రోషన్ కనకాల కథానాయకుడిగా సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మోగ్లీ 2025. సాక్షి మడోల్కర్ కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది.మారేడుమిల్లి ఫారెస్ట్‌లో రీసెంట్‌గా బిగ్ ైక్లెమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. 15రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రోషన్ కనకాల చేసిన రిస్క్‌తో కూడుకున్న యాక్షన్ స్టంట్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఇంకో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని, ఈ నెలలోనే టీజర్‌ని కూడా విడుదల చేస్తామని వారు తెలిపారు. గా నటిస్తున్న ఈ చిత్రంలో బండి సరోజ్‌కుమార్ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ.
