Skip to main content

Namaste NRI

మోగ్లీ 2025 యాక్షన్ షెడ్యూల్ పూర్తి

రోషన్‌ కనకాల కథానాయకుడిగా సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ మోగ్లీ 2025. సాక్షి మడోల్కర్‌ కథానాయిక.   పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది.మారేడుమిల్లి ఫారెస్ట్‌లో రీసెంట్‌గా బిగ్‌ ైక్లెమాక్స్‌ యాక్షన్‌ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. 15రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రోషన్‌ కనకాల చేసిన రిస్క్‌తో కూడుకున్న యాక్షన్‌ స్టంట్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఇంకో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని, ఈ నెలలోనే టీజర్‌ని కూడా విడుదల చేస్తామని వారు తెలిపారు. గా నటిస్తున్న ఈ చిత్రంలో బండి సరోజ్‌కుమార్‌ కీలక పాత్రధారి. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ.

Social Share Spread Message

Latest News