Namaste NRI

మటన్ సూప్ .. రియల్ క్రైమ్ కథతో వస్తున్న వర్షా విశ్వనాథ్

రమణ్‌, వర్షా విశ్వనాథ్‌ జంటగా రూపొందుతున్న విభిన్న కథాచిత్రం మటన్‌ సూప్‌. విట్‌నెస్‌ ది రియల్‌ క్రైమ్‌ అనేది ఉపశీర్షిక. రామచంద్ర వట్టికూటి దర్శకుడు. మల్లికార్జున ఎలికా(గోపాల్‌), అరుణ్‌చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

అగ్ర నిర్మాత కె.ఎస్‌.రామారావు పోస్టర్‌ని ఆవిష్కరించి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఇష్టంతో కష్టపడి ఈ సినిమా చేస్తున్నామని, ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నామని హీరో రమణ్‌ అన్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేశామని త్వరలోనే విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఇంకా దర్శకుడు రామచంద్ర వట్టికూటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పర్వతనేని రాంబాబు, లైన్‌ ప్రొడ్యూసర్‌ కొమ్మా రామకృష్ణ, ఎడిటర్‌ లోకేష్‌ కడలి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events