Namaste NRI

నభా నటేశ్ నాగబంధం.. నమోరే సాంగ్ రిలీజ్

ప్రసిద్ధ దేవాలయాలు, నేలమాళిగలు, నిధి నిక్షేపాలు తదితర అంశాల మేళవింపుగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ నాగబంధం. విరాట్‌కర్ణ హీరోగా అభిషేక్‌ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా నమోరే.. నమో నమోరే.. నమో నమో నారాయణే అంటూ సాగే భక్తిరసాత్మక గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. ఆధ్యాత్మికత, కళాత్మకత ప్రతిబింబించేలా ఈ పాట రూపొందింది.

విష్ణుదేవుని స్తుతిగా తయారైన ఈ గీతాన్ని శ్రీహర్ష ఈమని రాయగా, జునైద్‌కుమార్‌, అభే స్వరపరిచారు. సింధూజా శ్రీనివాసన్‌, ఐశ్వర్య దారూరి ఆలపించారు. గణేశ్‌ ఆచార్య, శ్రేష్టి వర్మ కొరియోగ్రఫీ అందించారు. రెండువేలమంది నర్తకీమణులు ఈ పాటలో భాగమయ్యారు. నభా నటేష్‌, దక్ష నగార్కర్‌ హావభావాలు, నాట్యవిన్యాసాలు పాటకు ఆకర్షణగా నిలిచాయి. తిరువనంతపరం పద్మనాభస్వామి ఆలయాన్ని తలపించేలా కళాదర్శకుడు అశోక్‌కుమార్‌ వేసిన సెట్‌ పాటకు నిండుదనాన్ని తెచ్చింది. ఈ చిత్రానికి నిర్మాణం: ఎన్ఐకె స్టూడియోస్‌, అభిషేక్‌ పిక్చర్స్‌.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events