Namaste NRI

కుబేర నుంచి నాగార్జున ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్‌

కోలీవుడ్‌ హీరో ధనుష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న  మూవీ కుబేర. రష్మిక మంధన్నా హీరోయిన్‌.  శేఖర్ కమ్ముల దర్శకత్వం. ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై తెలుగులోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే కింగ్‌ నాగార్జున గెటప్‌ను కూడా మేకర్స్‌ రివీల్‌ చేశారు. ఓ కంటైనర్‌ లారీ నిండా డబ్బులు ఉండగా,  వర్షంలో గొడుగు పట్టుకుని, కళ్లద్దాలు పెట్టుకుని నాగార్జున ఆ డబ్బునే చూస్తుంటా డు. ఆ తర్వాత వెనక్కి తిరిగి వర్షపు నీటిలోనే నడుచుకుంటూ వెళ్తాడు. ఇంతలో ఒక నోటు కింద పడి ఉండ టం చూసి అక్కడే ఆగిపోతాడు. ఆ తర్వాత తన పర్స్‌లో నుంచి కొంత డబ్బు తీసుకుని వెనక్కి వచ్చి కంటైన ర్‌లో పెట్టేస్తాడు. మొత్తంగా నాగ్‌ లుక్‌తో పాటు ఈ సీన్‌ అదిరిపోయింది. నాగ్‌ ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ సినిమాపై ఆసక్తి ని మరింత రెట్టింపు చేసింది.

ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ధనుష్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఈ సినిమాపై క్యూరియాసి టీని పెంచింది. కుబేర టైటిల్‌కు భిన్నంగా ధనుష్‌ బిచ్చగాడి గెటప్‌లో ఉండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అటు టాలీవుడ్‌, ఇటు కోలీవుడ్‌ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events