Namaste NRI

భ‌ర్త రాక కోసం భార్య ప‌డే విర‌హ వేదన.. రారా పెనిమిటి అంటూ నందిత శ్వేత‌

నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటించిన సినిమా రారా పెనిమిటి. శ్రీ విజయానంద్‌ పిక్చర్స్‌ పతాకంపై శ్రీమతి ప్రమీల గెద్దాడ నిర్మించారు. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. ఒకే పాత్రతో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్య వెంకట గెద్దాడ మాట్లాడుతూ గ్రామీణ వాతావరణంలో సాగే చిత్రమిది. గడుసైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో నందిత నటన మెప్పిస్తుంది. ఒకే పాత్రతో సినిమా తెరకెక్కించినా పలు క్యారెక్టర్స్‌ ఫోన్‌ ద్వారా మాట్లాడుతుంటాయి. అలా ఫోన్‌లో మాట్లాడే పాత్రల్లో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్‌, సప్తగిరి, హేమ తదితరులు డబ్బింగ్‌ చెప్పారు. మణిశర్మ సంగీతం ఆకర్షణ అవుతుంది అన్నారు.  

నందిత శ్వేత మాట్లాడుతూ ఒకే పాత్రతో కథ ఉంటుందని దర్శకుడు చెప్పగానే, ఈ క్యారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అని భయపడ్డాను. ఇలాంటి సినిమా సాహసమే అయినా అంగీకరించాను. కొత్తగా పెళ్లైన  అమ్మాయి తన భర్త కోసం పడే విరహ వేదనే ఈ చిత్రం. అన్ని రకాల భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయి. మా సినిమాకు విజయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను  అన్నారు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంగీతం – మ‌ణిశ‌ర్మ‌, సాహిత్యం డా.డి.నీల‌కంఠ‌రావు, సినిమాటోగ్ర‌ఫీ -రామ్ కుమార్, పీఆర్వో – ర‌మేష్ చందు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events