నాని నటిస్తున్న సినిమా ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హీరో నాని పుట్టిన రోజు సందర్భంగా ఆయా షేర్ అంటూ సాగే ఇంట్రో సాంగ్‌ను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. నీ అయ్య జాగీరా..ఛల్ మావోడొచ్చిండ్రా..ఆయా షేర్ అంటూ ఎనర్జిటిక్‌గా ఈ పాట సాగింది.

తెలంగాణ జానపద గాయకులు అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య ఆలపించారు. ట్రైబల్ వైబ్, పవర్‌ఫుల్ మాస్ బీట్ కలబోతగా ఈ పాట జోష్‌ని పంచేలా ఉంది. జడలతో కూడిన హెయిర్ ైస్టెల్, రగ్గ్‌డ్ లుక్‌తో హీరో నాని వారియర్‌లా కనిపించారు. ఆధిపత్యం, అహంకారాన్ని ఎదిరించే ఓ యువకుడి కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఆగస్ట్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్: అనివాష్ కొల్లా, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.















