Skip to main content

Namaste NRI

నాని బర్త్‌డే స్పెషల్‌..ది ప్యారడైజ్‌ నుంచి ఆయా షేర్‌ సాంగ్‌

నాని నటిస్తున్న సినిమా ది ప్యారడైజ్‌. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. హీరో నాని పుట్టిన రోజు సందర్భంగా ఆయా షేర్‌ అంటూ సాగే ఇంట్రో సాంగ్‌ను విడుదల చేశారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరపరిచిన ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రచించారు. నీ అయ్య జాగీరా..ఛల్‌ మావోడొచ్చిండ్రా..ఆయా షేర్‌ అంటూ ఎనర్జిటిక్‌గా ఈ పాట సాగింది.

తెలంగాణ జానపద గాయకులు అడ్డుల జంగిరెడ్డి, ఆకునూరి దేవయ్య ఆలపించారు. ట్రైబల్‌ వైబ్‌, పవర్‌ఫుల్‌ మాస్‌ బీట్‌ కలబోతగా ఈ పాట జోష్‌ని పంచేలా ఉంది. జడలతో కూడిన హెయిర్‌ ైస్టెల్‌, రగ్గ్‌డ్‌ లుక్‌తో హీరో నాని వారియర్‌లా కనిపించారు. ఆధిపత్యం, అహంకారాన్ని ఎదిరించే ఓ యువకుడి కథతో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన్‌బాబు, రాఘవ్‌ జుయల్‌, సంపూర్ణేష్‌ బాబు తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఆగస్ట్‌ 21న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అనివాష్‌ కొల్లా, దర్శకత్వం: శ్రీకాంత్‌ ఓదెల.

Social Share Spread Message

Latest News