
శర్వానంద్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ నారి నారి నడుమ మురారి. సంయుక్త మీనన్, సాక్షి విద్య కథానాయికలు. రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు. ఏప్రిల్ 7న దర్శనమే అంటూ సాగే ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్‌లో శర్వానంద్, సంయుక్త రొమాంటిక్ మోడ్‌లో బైక్ రైడ్‌ని ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: భాను భోగవరపు, మాటలు: నందు సవిరిగాన, కెమెరా జ్ఞానశేఖర్ వి.ఎస్, యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సహనిర్మాత: అజయ్ సుంకర, నిర్మాణం: ఏకె ఎంటైర్టెన్మెంట్స్, అడ్వంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై.లిమిటెడ్.
