Skip to main content

Namaste NRI

నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

శర్వానంద్ హీరోగా  నటిస్తున్న రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ నారి నారి నడుమ మురారి. సంయుక్త మీనన్‌, సాక్షి విద్య కథానాయికలు. రామ్‌ అబ్బరాజు దర్శకుడు. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మాతలు. సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తికావచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్‌ మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టనున్నారు. ఏప్రిల్‌ 7న దర్శనమే అంటూ సాగే ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్‌ పోస్టర్‌లో శర్వానంద్‌, సంయుక్త రొమాంటిక్‌ మోడ్‌లో బైక్‌ రైడ్‌ని ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: భాను భోగవరపు, మాటలు: నందు సవిరిగాన, కెమెరా జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌, యువరాజ్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, సహనిర్మాత: అజయ్‌ సుంకర, నిర్మాణం: ఏకె ఎంటైర్టెన్మెంట్స్‌, అడ్వంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రై.లిమిటెడ్‌.

Social Share Spread Message

Latest News