Namaste NRI

నరుడి బ్రతుకు నటన గ్లింప్స్ రిలీజ్

శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వీవీఏ రాఘవ్, దయా నంద్ రెడ్డి త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లో  నటిస్తున్న చిత్రం నరుడి బ్రతుకు నటన.  రిషికేశ్వర్ యోగి ద‌ర్శ‌క‌ త్వం.  ఈ సినిమా నుంచి తాజాగా మేక‌ర్స్ గ్లింప్స్‌ విడుద‌ల చేశారు. నీకు న‌ట‌న రాదు. అది అంద‌రికి తెలుసు. నా జీవితం మొత్తంలో ఇంత చెత్త న‌టుడిని నేనేప్పుడు చూడ‌లేదు అనే సంభాషణలతో గ్లింప్స్‌ మొద‌ల‌వు తుంది. ఇక ఈ గ్లింప్స్ గ‌మ‌నిస్తే,  అవమానాలు ఎదుర్కొంటున్న ఒక యువ‌కుడి గురించి చెబుతున్నట్లు కనిపి స్తుంది. కేరళ అందాలతో అద్భుతంగా సాగిన ఈ గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఇక ఈ సినిమా మల‌ యాళం బ్లాక్ బ‌స్ట‌ర్ కుంబ‌లాంగి నైట్స్ రీమెక్ అని తెలుస్తుంది. దీనిపై మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌వ‌ల‌సి ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధూ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News