Skip to main content

Namaste NRI

నరుడి బ్రతుకు నటన నుంచి చెప్పలేని అల్లరేదో

శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్యా అనిల్ కుమార్, వైవా రాఘవ వంటి వారు ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం నరుడి బ్రతుకు నటన. ఈ మూవీని రిషికేశ్వర్ యోగి తెరకెక్కిస్తున్నా రు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బొరెడ్డి, డా. సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూఛిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్లు మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, తాజాగా ఈ మూవీ నుండి చెప్పలేని అల్లరేదో అనే రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ వదిలారు. చెప్పలేని అల్లరేదో.. తొంగి చూసే.. కళ్ళలోనా..ఇది ఏ మహిమో తెలియదు గానీ.. మది పసిపాపై సరదా పడెనే..నీవే.. నీవే.. నే వెతికిన లాలనవే.. అంటూ సాగిన ఈ పాటను చిత్రన్ రచించగా, అనంతు ఆలపించారు. లోపెస్ ఇచ్చిన మెలోడీయస్ ట్యూన్ వినగానే ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఈ లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ మరింత హైలెట్ అవుతున్నాయి.

ఈ చిత్రం విడుదలకు ముందే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు విడుదల తర్వాత కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటుందని, తప్పకుండా మంచి చిత్రంగా పేరుపొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు. కేరళలోని అందమైన ప్రాంతాల్లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తుంది. చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

Social Share Spread Message

Latest News