Skip to main content

Namaste NRI

నితిన్ తమ్ముడు రిలీజ్ డేట్ వచ్చేసింది

నితిన్‌ కథానాయకుడిగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తమ్ముడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తు న్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రధారులు.   ప్రమోషన్‌లో భాగంగా ఈ నెల 11న సాయంత్రం 5గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్‌ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తమ్ముడు  మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను ఫన్నీగా మేకర్స్‌ డిజైన్‌ చేశారు.

లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్‌, సప్తమి గౌడ, బేబీ శ్రీరామ్‌ఆదిత్య అందరూ కలిసి ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌కీ తామంటే తామే కారణమని గొడవ పడుతుండగా, దర్శకుడు శ్రీరామ్‌ వేణు వచ్చి మీ డౌట్స్‌ అన్నీ క్లారిఫై కావాలంటే ముందు ట్రైలర్‌ చూడండి అని చెప్తాడు. ఈ విధంగా మూవీ లవర్స్‌లో సినిమాపై ఆసక్తి పెరిగే విధంగా ట్రైలర్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను మేకర్స్‌ డిజైన్‌ చేశారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వస్తున్న ఈ సినిమా దర్శకుడిగా అతని స్థాయిని మరింత పెంచేలా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రం జూలై 4న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్‌, సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌.

Social Share Spread Message

Latest News