Namaste NRI

కెనడాలో అంగరంగ వైభవంగా నోవా మల్టీ ఫెస్ట్  వేడుకలు

కెనడాలోని హాలిఫాక్స్, డార్ట్ మౌత్ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారు భారతీయ సంస్కృతి, సాంప్రదాయా లను ప్రతిబింబించేలా మల్టీఫెస్ట్-2024 వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశాల్ భరద్వాజ్ బృందం, సీఈవో జోసెఫ్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

Mayfair 29

భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతాన్ని ప్రదర్శించారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రదర్శించే ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. భారతీయ దుస్తుల స్టాల్, భారతీయ ఆహార స్టాల్‌‌ను ఏర్పాటు చేశారు. ఏ దేశ మేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపర నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ చిన్న పిల్లలు భారతీయ నృత్యం , శాస్త్రీయ సంగీతాన్ని ప్రదర్శించారు. అతిథులకు భారతీయ, తెలుగు వంటకాలను వడ్డించారు. శ్రీహరి రెడ్డి చల్లా, సురేష్ ప్రియాంక, శ్రీలేఖ, చంద్ర శ్రీలేఖ, మిలింద్, శ్రీకాంత్, రోహిత్, సోను, ప్రదీప్ సౌజన్య, ఆస్తా, కృష్ణవేణి, రత్నం, శ్యామల, సాత్వికీ, కావ్య తదితరులు ఈ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాల్లో పాల్గొని ఆహుతులను ఆహ్లాదపరిచారు.

Ixora 29

భారతీయ, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు దేశభక్తి గీతాలను ఆలపించారు. నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమానికి కెనడా దేశస్తులు, స్థానిక భారతీయులు కలిపి మొత్తం 27 వేల మంది హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events