Skip to main content

Namaste NRI

నార్వే వీధి అరుగు ఆధ్వ‌ర్యంలో ఎన్టీఆర్ శ‌త జ‌యంతి…  ఆన్‌లైన్ మీట్‌

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి కీ.శే. నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా నార్వేకు చెందిన వీధి అరుగు అనే సంస్థ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 27న ఆన్‌లైన్ మీట్ జ‌రుగుతున్న‌ది. ఈ ఆన్‌లైన్ మీట్‌ 40 దేశాలలోని 100 పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో నిర్వ‌హిస్తున్నారు.

ఈ నెల 28 నాటికి ఎన్టీఆర్ జ‌న్మించి శ‌త వ‌సంతాలు పూర్తి కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ మ‌హానీయుడ్ని ప్ర‌త్యేకంగా స్మ‌రించుకునేందుకు ఇంట‌ర్నెట్ వేదిక‌గా ఈ నెల 27న ఈ ఆన్‌లైన్ మీట్ నిర్వ‌హిస్తున్నామ‌ని వెంక‌ట్ త‌రిగోపుల తెలిపారు. ఎన్టీఆర్ అభిమానుల‌తోపాటు అంద‌రికీ ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. శకపురుషుని శతవసంతాలు అనే పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మం ఈ నెల 27న ఉదయం 8:00 గంట‌ల నుండి రాత్రి 10 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం) నిర్వ‌హిస్తున్నారు. ఆస‌క్తి గ‌ల వీక్ష‌కులు ఈ కార్య‌క్ర‌మాన్ని https://www.youtube.com/watch?v=egLQZjdjyEE లింక్‌లో వీక్షించ‌వ‌చ్చు.

14 గంటలపాటు నిర్విరామంగా, అంతర్జాల వేదికపై జరిగే ఈ అపురూపమైన కార్యక్రమాన్ని వీక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రిని సవినయంగా కోరుకుంటున్నాం అని వీధి అరుగు నిర్వాహ‌కులు వెంక‌ట్ త‌రిగోపుల తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events