Skip to main content

Namaste NRI

థ్యాంక్యూ నుంచి నాతో నువ్వేంటో లిరికల్‌ సాంగ్‌

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్‌ యూ.  విక్రమ్‌. కె.కుమార్‌ దర్శకుడు. రాశి ఖన్నా, మాళవిక నాయక్‌, అవికా గోర్‌ కథానాయికలు.  టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి చైతన్య, మాళవికలపై చిత్రీకరించిన  ప్రేమగీతమిది. ఏంటో ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో.. నీత నేనేంటో.. చూసే చూపేంటో.. మారే తీరెంటో అంటూ సాగే మెలోడి లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు తమన్‌ స్వరాలు సమకూర్చగా అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యాన్ని అందించారు. జోనిత గాంధీ ఆలపించారు. వినూత్నమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నాగచైతన్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. దిల్‌రాజు, శిరిష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జులై 8న ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి కథ: బీవీఎస్‌ రవి,  ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్‌.

Social Share Spread Message

Latest News