తెలుగు సినీరంగంలో ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్నది. అలనాడు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచిన చిత్రాలను మరలా ప్రేక్షకులకు ముందుకుతీసుకొస్తున్నారు. నాగార్జున నటించిన సూపర్‌హిట్ మూవీ మాస్ ఫోర్‌కే ఫార్మాట్‌లో ఆయన జన్మదినం సందర్భంగా ఈ నెల 29న రీరిలీజ్ కానుంది. 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో నాగార్జునకు అత్యధిక వసూళ్లు అందించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించారు. ఈ సినిమాలో జ్యోతిక, ఛార్మి, రఘువరన్, రాహుల్‌దేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతా న్నందించారు. ఫోర్‌కే ఫార్మాట్‌లో రీరిలీజ్ అవుతున్న ఈ చిత్రం నాగార్జున అభిమానులను అలరిస్తుందని చిత్ర బృందం పేర్కొంది.