Skip to main content

Namaste NRI

ఒకదాని తర్వాత మరొకటి…వారం రోజుల్లో ఇది నాలుగో ఘటన

అమెరికా మరో ఎగిరే వస్తువును కూల్చేసింది. యూఎస్ పరిధిలో గగనతల నిబంధనలను ఉల్లంఘించడంతో నాలుగో వస్తువును షూట్ చేసి పేల్చేసింది. 8 కోణాలతో ఉన్న ఆ వస్తువు అమెరికా, కెనడా సరిహద్దుల్లో హ్యురోన్ సరస్సుపై ఎగురుతూ కనిపించింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశానుసారం యూఎస్ ఆర్మీకి చెందిన ఎఫ్ – 16 ఫైటర్ జెట్ దానిని కూల్చేసింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వస్తువులు అమెరికా గగనతలంలో కనిపించడం, వాటిని పేల్చేయడం ఇది నాలుగోసారి. తాజాగా ఆకాశంలో కనిపించిన వస్తువును సైనిక ముప్పుగా పరిగణించలేదని, అయితే అది పౌర విమానయానానికి ముప్పును కలిగిస్తుందన్న ఉద్దేశంతోనే కూల్చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

గత వారం రోజుల్లో అమెరికా, కెనడా గగనతలంలో యూఎఫ్ఓలు కనిపించిన కేసులు నాలుగు నమోదు అయ్యాయి. ఈ నాలుగింటిలో 3 ఎగిరే వస్తువులు అమెరికా ఆకాశంలో కనిపించగా, ఒక యూఎఫ్ఓ కెనడియన్ గగనతలంలో కనిపించింది. ఈ నాలుగు ఎగిరే వస్తువులన్నింటిని అమెరికా సైనిక విభాగం యుద్ధ విమానాల ద్వారా కూల్చివేశారు.  తాజాగా పేల్చేసిన వస్తువు కెనడా గగనతలం పరిధిలో కనిపించింది. యూఎస్ ఫైటర్ జెట్ ఈ ఎగిరే వస్తువును కూల్చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఎగిరే వస్తువు కనిపించినట్లు నిర్ధారించారు. పీఎం ట్రూడో అనుమతి మేరకు కెనడియన్ గగనతలంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువును కూల్చేసినట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News