ప్రపంచ గమనాన్ని మార్చుతున్న ఇరాన్ యుద్ధాన్ని ఆపే శక్తి మోదీ, పుతిన్, జిన్పింగ్లకు మాత్రమే ఉన్నట్లు అమెరికా ఆర్థికవేత్త, ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్ తెలిపారు. ప్రపంచ విధ్వంసాన్ని వీళ్లు మాత్రమే అడ్డుకోగలరని ఆ ప్రొఫెసర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆ ముగ్గురు నేతలకు మంచి గుర్తింపు ఉన్నదని, వాళ్లు ఎంతో పరిణితి చెందిన వ్యక్తులు అని, అయితే ప్రస్తుత సంక్షోభాన్ని మోదీ, పుతిన్, జిన్‌పింగ్ అడ్డుకోగలరన్నారు. అమెరికా దూకుడును ఈ ముగ్గురు నేతలు ఆపగలరని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరాన్ యుద్ధం ఆగాలని, గొప్ప వ్యక్తులే దీన్ని ఆపగలరని, ప్రస్తుతం ప్రపచంలో ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఆ సామర్థ్యం ఉందని, ఆ ముగ్గురు కలిసి ఈ విపత్తును నివారించాలన్నారు. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలకమైన వ్యక్తులు అని, మూడు సూపర్‌పవర్ దేశాలకు చెందిన నేతలని, ప్రపంచాన్ని వినాశనం నుంచి అడ్డుకోగలరని, బ్రిక్స్ లాంటి వేదిక ద్వారా ఈ యుద్ధాన్ని నిలువరించగలరని ఆయన అభిప్రాయపడ్డారు.















