
ఓరి నాయనో పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. గొండి మణితేజ దర్శకుడు. సాయి అభిషేక్ నిర్మాత. ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన హీరో నవీన్‌చంద్ర టైటిల్‌ని ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మరిచిపోలేని జ్ఞాపకంగా, వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుందని చిత్రదర్శకుడు గొండి మణితేజ అన్నారు. నటీనటుల ఎంపిక జరుగుతున్నదని, పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు. చిత్రబృందంతోపాటు దర్శకుడు అనిల్ విశ్వనాథ్, సత్యం రాజేశ్, డీవోపీ వెట్రి పళనిస్వామి కూడా పాల్గొన్నారు.





























