Skip to main content

Namaste NRI

పళ్ళబురుసు నుంచి ఇచ్చి పడేద్దాం సాంగ్ రిలీజ్

తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న విలేజ్‌ డ్రామా పళ్లబురుసు. సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌గౌడ్‌, ప్రజ్వల్‌ యాద్మా, గోమతిరెడ్డి ప్రధాన పాత్రధారులు. ఉదయ్‌చౌహాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎపిక్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇచ్చి పడేద్దాం అనే పాటను మంగళవారం విడుదల చేశారు.

పెళ్లి దావత్‌, బారాత్‌ తాలూకు జోష్‌ని ఆవిష్కరిస్తూ ్త ఆద్యంతం హుషారుగా ఈ పాట సాగింది. ఇచ్చి ఇచ్చి పడేద్దాం..దావత్‌ అయినా…బారాత్‌ అయినా అంటూ క్యాచీ లిరిక్స్‌, ఉత్సాహభరితమైన బీట్‌తో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. పవన్‌ సిహెచ్‌ స్వరాల్ని అందించిన ఈ పాటను మనీషా ఈరబత్తిని, నితేష్‌ అహేర్‌ ఆలపించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events