Skip to main content

Namaste NRI

బీజింగ్‌లో భయాందోళనలు… ఎందుకో తెలుసా?

చైనా రాజధాని బీజింగ్‌ ప్రజలు భయాందోళనల్లో  మునిగి ఉన్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించనున్నారని ప్రచారం జరుగుతుంది.  నిత్యవసరాల కొనుగోలుకు ప్రజలు పొటెత్తారు.  హోమ్‌ డెలివరీ కూడా నిలిచిపోన్నదని, ప్రజలు షాపుల వద్ద భారీగా బారులు తీరారు. చాయంగ్‌ జిల్లాను కరోనా వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాతో పాటు రాజధాని బీజింగ్‌లో  మూడు రోజులు లాక్‌డౌన్‌ విధిస్తున్నారు.  ప్రజలంతా ఇళ్లలోనే ఉండాల్సి ఉంటుంది. కరోనా పరీక్షకు మాత్రమే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో షాంఘై తరహా లాక్‌డౌన్‌ విధించ వచ్చన్న ప్రచారంతో బీజింగ్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు భయందోళన చెందాల్సిన అవసరం లేదని, ఫుడ్‌ డెలివరీలను నిలిపివేయబోమని బీజింగ్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.

Social Share Spread Message

Latest News