Skip to main content

Namaste NRI

రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది : నాగవంశీ

సితార ఎంటర్టైన్మెంట్స్, పార్చ్యూన్స్ ఫోర్ సినిమాతో కలిసి రూపొందించిన చిత్రం స్వాతిముత్యం. గణేష్, వర్షబొల్లమ్మ జంటగా నటించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం అందుకుంది. ఈ సందర్బంగా యూనిట్ విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ తెరపై గణేష్ కాదు బాలమురళీయే (సినిమాలో గణేష్ పాత్ర) కనిపిస్తున్నాడన్నప్పుడు నటుడిగా ఓ పది మార్కులు సాధించాననే తృప్తి కలిగింది. ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చి, నా నుంచి నటనను రాబట్టుకున్న లక్ష్మణ్కు థ్యాంక్స్. ఈ కథను ఎక్కువగా నమ్మి, నిర్మించిన నాగవంశీగారికి రుణపడి ఉంటాను అని అన్నారు. దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ మా సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో ఆనందంగా ఉందన్నారు. అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన యూనిట్కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. స్వాతిముత్యం రిలీజ్కు ముందు చిరంజీవిగారు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు చిరంజీవిగారి గాడ్ఫాదర్, స్వాతిముత్యం చిత్రాలు విజయాలు సాధించినందుకు హ్యాపీగా ఉంది. స్వాతిముత్యం సినిమాకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది అన్నారు నాగవంశీ. ఈ కార్యక్రమంలో గణేష్, నిర్మాత నాగవంశీ, దివ్య శ్రీపాద, సురేఖావాణి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events